Gold Rate | బులియన్ మార్కెట్‌లో శనివారం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల తులం బంగారం రూ.54,950 వద్ద కొనసాగుతున్నది.
24 క్యారెట్ల తులం బంగారం రూ.59,950 వద్ద ట్రేడవుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,100 వద్ద కొనసాగుతున్నది.
ముంబయిలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,950 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.59,950 పలుకుతున్నది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.55,350 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.60,380 వద్ద ట్రేడవుతున్నది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.54,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,950 వద్ద ఉన్నది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.54,950 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,950 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
అదే సమయంలో వెండి ధర స్వలంగా తగ్గుముఖం పట్టింది. కిలోకు రూ.200 తగ్గి రూ.74,800 పలుకుతున్నది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.78,200 పలుకుతున్నది.
అయితే, యూఎస్ జాబ్ డేటా తర్వాత అమెరికన్ డాలర్, బాండ్ ఈల్డ్స్ కిందకు దిగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేటు మళ్లీ పుంజుకుంటున్నది. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,979 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.