నిలకడగా బంగారం ధరలు.. హైదరాబాద్‌లో నేటి ధరలు ఇవే..!

ఇటీవల బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆకాశాన్నంటుతున్న ధరలతో సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు

  • Publish Date - December 25, 2023 / 03:26 AM IST

Gold Rates | ఇటీవల బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆకాశాన్నంటుతున్న ధరలతో సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు. నిన్న మొన్నటి వరకు పెరిగిన ధరలు నేడు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల గోల్డ్‌ తులానికి రూ.58,200 పలుకుతున్నది మరో వైపు 24 క్యారెట్ల పసిడి తులానికి రూ.63,490 వద్ద స్థిరంగా ఉన్నది.


దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.58,750 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.64,090 వద్ద నిలకడగా ఉన్నది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.58,200 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.63,490 పలుకుతున్నది. ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.58,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,640 వద్ద ఉన్నది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.58,200 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,490 పలుకుతున్నది.


ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర సైతం స్థిరంగా కొనసాగుతున్నది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.80,500 గా ఉన్నది. ప్లాటినం ధర భారీగానే పెరిగింది. తులానికి రూ.320 ఎగిసి తులానికి రూ.26,260కి ఎగిసింది. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ప్లాటినం ధర తులానికి రూ.26,260 ధర పలుకుతున్నది.