Gold Rates | మహిళలకు బంగారం అంటే ఎంత ప్రీతో ప్రత్యేకంగా చెప్పాల్సిన వసరం లేదు. పెళ్లిళ్లతో పాటు ఇంట్లో ఏ చిన్న శుభకార్యం, వేడుక అయినా బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. దాంతో సాధారణంగానే బంగారానికి భారీగా డిమాండ్ ఉంటున్నది. అయితే, ఇటీవల ధరలు రికార్డు స్థాయిలో గరిష్ఠానికి చేరుకోగా.. తాజాగా స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2వేల డాలర్లపైగా ట్రేడవుతోంది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 25 డాలర్ల మార్కు ఎగువన ఉన్నది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ.82.133 వద్ద ట్రేడవుతున్నది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాము బంగారంపై రూ.90 తగ్గి.. రూ.55,850 వద్ద స్థిరపడింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.110 వరకు తగ్గింది. రూ.60,920 వద్ద కొనసాగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.56వేలు, 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.61,070 మార్కు మార్క్ వద్ద ట్రేడవుతున్నది. ఇక వెండి విషయానికి వస్తే ఒకే రోజు రూ.1100 వరకు తగ్గింది. ఢిల్లీలో కిలో వెండి రూ.77,400, హైదరాబాద్‌లో రూ.80,500 ధర పలుకుతున్నది.