Site icon vidhaatha

Gold Rates | స్థిరంగా బంగారం ధరలు..! హైదరాబాద్‌లో తులం ఎంత ఉందంటే..?

Gold Rates | దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మొన్న ధరలు పెరగగా.. నిన్న స్వల్పంగా దిగివచ్చాయి. సోమవారం మార్కెట్‌లో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.55,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.60,700 వద్ద ట్రేడవుతున్నది.

ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.55,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.61వేల వద్ద కొనసాగుతున్నది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.55,900 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.61వేల వద్ద ట్రేడవుతున్నది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.60,600 వద్ద ట్రేడవుతున్నది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,550 పలుకుతున్నది.

ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు కిలో వెండి హైదరాబాద్‌లో రూ.79,800 వద్ద కొనసాగుతున్నది.

Exit mobile version