Gold Rates |
బంగారం ధరలు వినియోగదారులకు ఊరట కలిగించాయి. నిన్న మొన్నటి వరుసగా పెరుగుతూ రాగా.. శుక్రవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.55,950, ఇక స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం రూ. 61,040 పలుకుతున్నది.
దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బంగారం రేట్లు స్థిరంగానే కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,100 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.61,190 వద్ద ట్రేడవుతున్నది.
ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.55,950, స్వచ్ఛమైన 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,040 పలుకుతున్నది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,950 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రేటు రూ.61,040 వద్ద ట్రేడవుతున్నది.
తెలుగు రాష్ట్రాలన్నింటిలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. వెండి ధరలు సైతం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో కిలో వెండి రూ.80,200 పలుకుతోంది. ఇక ప్లాటినం ధర పది గ్రాములకు రూ.140 తగ్గింది. ప్రస్తుతం రూ.28,730 వద్ద కొనసాగుతున్నాయి.