Site icon vidhaatha

Google Drive | ఆలర్ట్‌: ఆగస్ట్‌ నుంచి.. ఆ విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లలో గూగుల్‌ డ్రైవ్‌ సేవలు బంద్‌..!

Google Drive |

గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆగస్ట్‌ నుంచి విండోస్‌ (Windows 32-బిట్‌ వెర్షన్‌) ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వినియోగిస్తున్న యూజర్లకు గూగుల్ డ్రైవ్‌ (Google Drive) సేవలు నిలిపి వేయనున్నట్లు వెల్లడించింది.

విండోస్‌ 8, విండోస్ 8.1, విండోస్ సర్వర్‌ 2012 యూజర్లకు ఆగస్ట్‌ నుంచి గూగుల్ డ్రైవ్‌ సేవలు అందుబాటులో ఉండవని ప్రకటించింది. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా యూజర్లకు మెరుగైన సేవలు అందిచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ప్రస్తుతం విండోస్‌ 8 (32-బిట్‌ వెర్షన్‌) ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వినియోగిస్తున్న యూజర్లు తమ కంప్యూటర్లలో ఓఎస్‌ను విండోస్‌ 10 (64-బిట్‌ వెర్షన్‌)కు అప్‌గ్రేడ్ చేసుకోవాలని సూచించింది.

అయితే, గూగుల్ బ్రౌజర్‌ ద్వారా యూజర్లు గూగుల్‌ డ్రైవ్‌ను యాక్సెస్‌ చేసుకోవచ్చని పేర్కొంది. సైబర్‌ దాడులు, యూజర్‌ డేటా భద్రత తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ప్రస్తుతం డ్రైవ్‌ యాప్‌, డెస్క్‌టాప్‌ వెర్షన్లలో అందుబాటులో ఉన్నది. ఈ ఏడాది ఏప్రిల్‌లో డ్రైవ్‌లో కొత్త ఫైల్స్ క్రియేషన్, స్టోరేజ్‌పై పరిమితులను తీసుకువచ్చింది. గతంలో మాదిరిగా యూజర్లు అపరిమిత ఫైల్స్‌ క్రియేట్ చేయలేరు. కేవలం ఐదు మిలియన్‌ ఫైల్స్‌ను మాత్రమే క్రియేట్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది.

దాంతోపాటు డ్రైవ్‌లో సెర్చ్ చిప్స్‌ పేరుతో కొత్త ఫీచర్‌ను గూగుల్ ప్రవేశపెట్టింది. దాని సహాయంతో యూజర్లు తమకు అవసరమైన ఫైల్స్‌ను ఫిల్టర్ల సాయంతో సులువుగా సెర్చ్‌ చేసుకోవచ్చని వెల్లడించింది.

Exit mobile version