RTC బిల్లుకు.. గవర్నర్‌ సానుకూలం: థామస్‌రెడ్డి

RTC అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపే ఆమోదిస్తామన్నారు విధాత: అర్టీసీ బిల్లుకు గవర్నర్‌ తమిళ సై సానుకూలంగా ఉన్నారని, బిల్లు ముసాయిదాను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదిస్తానని హమీ ఇచ్చారని ఆర్టీసీ కార్మిక సంఘం నాయకుడు థామస్‌ రెడ్డి తెలిపారు. గవర్నర్‌తో చర్చల పిదప ఆయన మీడియాతో మాట్లాడుతు గతంలో ఆర్టీసీ కార్మికులకు సహాయం చేశానని… ఇప్పుడు కూడా అదే చేస్తానని చెప్పారని, గవర్నర్ అడిగిన వివరణలకు ప్రభుత్వం నుంచి సమాధానం అందగానే ముసాయిదాను సాయంత్రం వరకు అసెంబ్లీ […]

  • Publish Date - August 5, 2023 / 12:44 AM IST

RTC

  • అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపే ఆమోదిస్తామన్నారు

విధాత: అర్టీసీ బిల్లుకు గవర్నర్‌ తమిళ సై సానుకూలంగా ఉన్నారని, బిల్లు ముసాయిదాను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదిస్తానని హమీ ఇచ్చారని ఆర్టీసీ కార్మిక సంఘం నాయకుడు థామస్‌ రెడ్డి తెలిపారు.

గవర్నర్‌తో చర్చల పిదప ఆయన మీడియాతో మాట్లాడుతు గతంలో ఆర్టీసీ కార్మికులకు సహాయం చేశానని… ఇప్పుడు కూడా అదే చేస్తానని చెప్పారని, గవర్నర్ అడిగిన వివరణలకు ప్రభుత్వం నుంచి సమాధానం అందగానే ముసాయిదాను సాయంత్రం వరకు అసెంబ్లీ కి పంపేందుకు ప్రయత్నం చేస్తానని గవర్నర్ హామీ ఇచ్చారన్నారు.

గవర్నర్‌ను బిల్లును ఆమోదించాలని కోరామని, రాజ్ భవన్‌, ప్రభుత్వం వైఖరులతో బిల్లు ఆమోదం ఆలస్యం వల్ల మాకు ఇబ్బంది అవుతుందని చెప్పామన్నారు. ఎలాంటి అనుమానాలున్నా అసెంబ్లీ కి బిల్లును పంపాలని కోరామని, ఏదైనా ఉంటే ప్రభుత్వంతో మేము మాట్లాడుకుంటామని గవర్నర్ తో చెప్పామన్నారు.

బిల్లు ఇవ్వాలే ఆమోదం అవుతుందని ఆశిస్తున్నామన్నారు. మేమే ఆర్టీసీ కార్మికుల కోసం పోరాటం చేశామని, రాజ్ భవన్ వద్దకు మేము తీసుకొస్తేనే కార్మికులు వచ్చారన్నారు. ముఖ్యమంత్రిని మెప్పించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంకు తాము ఒప్పించామని, అశ్వత్థామ రెడ్డి కార్మిక ద్రోహి అని, కార్మిక మరణాలకు కారకుడని విమర్శించారు.

Latest News