Site icon vidhaatha

RTC విలీన బిల్లుపై.. మూడోసారి వివరణ కోరిన గవర్నర్

RTC

విధాత‌: ఆర్టీసీ విలీన బిల్లు డ్రాఫ్ట్ పై గవర్నర్ తమిళసై మూడోసారి ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఆర్టీసీలోని తాత్కాలిక ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తారో స్పష్టత ఇవ్వాలని డిప్యూటీ సెక్రటరీని గవర్నర్ తమిళసై ఆదేశించారు.

దీనిపై వివరణ ఇచ్చేందుకు ఆర్టీసీ అధికారులను తన వద్దకు పంపించాలని డిప్యూటీ సెక్రటరీని ఆదేశించారు. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు ఆర్టీసీ అధికారులు రాజ్ భవన్ కు వెళ్ళనున్నారు.

Exit mobile version