Telangana Budget | తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2023-24 బడ్జెట్‌కు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఇంకా ఆమోదం తెలుపలేదు.
గవర్నర్ తీరును సవాల్ చేస్తూ సోమవారం హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదించనున్నారు.
అయితే ఈ ఏడాది తెలంగాణ బడ్జెట్ రూ. 3 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3 లేదా 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది.