Site icon vidhaatha

Governor Tamilsai | రేపు గువ్వలగుట్టకు గవర్నర్ తమిళసై

Governor Tamilsai

విధాత: తెలంగాణ గవర్నర్ తమిళసై రేపు సోమవారం చందంపేట మండలం గువ్వలగుట్ట తండాను సందర్శించనున్నారు. తండాలోని కిడ్నీ వ్యాధి బాధితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. గువ్వలగుట్ట తండాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉండడం గతంలో చర్చనీయాంశమైంది.

ఈ అంశమై స్వయంగా డాక్టర్ కూడా అయిన గవర్నర్ తమిళ సై తండాను సందర్శించి బాధిత కుటుంబాలతో మాట్లాడి వ్యాధి విస్తరణకు కారణాలు, వ్యాధి గ్రస్తులు పడుతున్న బాధలు స్వయంగా తెలుసుకునేందుకు తండాను సందర్శిస్తున్నారని తెలుస్తుంది. అంతేకాకుండా గిరిజన ప్రాంతాల్లో మారుమూల తండాల్లో తరచూ పర్యటిస్తున్న గవర్నర్ తమిళసై అందులో భాగంగానే గువ్వలగుట్ట తండా పర్యటనకు వస్తున్నట్లుగా భావిస్తున్నారు.

నల్గొండ జిల్లా సరిహద్దు గ్రామాలైన గువ్వలగుట్ట తండా, సుద్దబావి తండా, పోగిళ్ల తండాల గిరిజనులు గతంలో తీవ్ర మంచినీటి ఎద్దడిని ఎదుర్కొనేవారు. మిషన్ భగీరథ పథకం కింద మర్రిగూడ నుండి 100 కిలోమీటర్ల మేరకు పైప్ లైన్ వేసి ఆయా ప్రాంతాలకు ప్రస్తుతం కృష్ణా మంచినీటిని అందిస్తున్నారు.

Exit mobile version