Site icon vidhaatha

క్లాస్‌మేట్‌ల సమ్మేళనంలో గుత్తా

విధాత: శాసన మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తను చదివిన చిట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1969-70 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో మిత్రులతో కలిసి సందడి చేశారు. పాఠశాల విద్యార్థిగా తన తోటి చదివిన మిత్రులతో కలిసి ఆనాటి విద్యార్థి దశ అనుభవాలను, జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

మండలి చైర్మన్ హోదాలో గవర్నర్ తర్వాత ప్రోటోకాల్‌లో రెండో స్థానంలో ఉన్న తమ పూర్వ సహచరుడు తమలో ఒకరిగా కలిసిపోయి. పేరు పెట్టి మరి పరస్పరం యోగక్షేమాలను చర్చించడం వారందరి అభిమానాన్ని చురగొంది.

తన పాఠశాల మిత్రులతో కలిసి స్వగ్రామం ఉరుమడ్లలో గుత్తా ఆనాటి విద్యార్థి దశ జ్ఞాపకాల చర్చలతో గడిపి అక్కడే అంత వనభోజనాలు చేశారు. తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులంతా తమ కుటుంబాలతో కలిసి హాజరయ్యారు.

Exit mobile version