Site icon vidhaatha

Gutta Sukhender Reddy | సంక్షేమంలో తెలంగాణ నంబర్‌వన్‌: గుత్తా సుఖేందర్‌రెడ్డి

Gutta Sukhender Reddy | విధాత, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్‌గా కొనసాగుతుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని ఎస్వీ గార్డెన్స్ లో జరిగిన బీసీ బంధు లక్ష రూపాయల చెక్కులను స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రావుతో కలిసి 300మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయడం లేదన్నారు. పుట్టిన బిడ్డ దగ్గర నుండి పెరిగి పెద్దయి ప్రయోజకులు అయ్యే వరకు కూడా ప్రభుత్వ పథకాలు అందిస్తున్న సర్కార్ తెలంగాణ సర్కార్ మాత్రమేనన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ సీఎం అయితేనే రైతు బంధు, రైతు భీమా, బీసీ బంధు , 24 గంటల ఉచిత కరెంట్ పథకాలు అమలు అవుతాయని చెప్పారు. ప్రతిపక్షాలు చెప్పే కల్లబొల్లి మాటలకు మోసపోయి వారి చేతికి అధికారం ఇస్తే రాష్ట్రం అధోగతి పాలు అవుతుందన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీనే మళ్ళీ ఆదరించాలని అప్పుడే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతుందని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి , మున్సిపల్ తిరునగర్ భార్గవ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ,ఎంపిపిలు,జడ్పిటిసిలు ,ఎంపీటీసీలు, సర్పంచ్ లు, బీఆరెస్ నేతలు పాల్గొన్నారు

Exit mobile version