Site icon vidhaatha

Hailstone | దంచి కొడుతున్న వడగళ్ల వాన

విధాత: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో వడగళ్ల (Hailstones) వాన దంచి కొట్టింది. దాదాపు గంటకు పైగా ఏకధాటిగా వర్షం కురిసింది. ఇంకా పలు చోట్ల వర్షం కురుస్తూనే ఉంది. గురువారం ఉదయం 10 గంటల తరువాత వాతావరణం ఒక్కసారిగా మారింది. అప్పటి వరకు ఎండ దంచి కొట్టింది.

ఈ త‌రువాత‌ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశం మబ్బులు కమ్మింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మర్పల్లి మండలంతో పాటు పలు ప్రాంతాల్లో వడగళ్లు పడ్డాయి. గాలి దుమారం లేచింది. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో చినుకులు పడ్డాయి.

బంగ్లాదేశ్‌ పరిసర ప్రాంతం నుంచి గంగా పశ్చి బెంగాల్‌, ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా వరకు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉపరిత ద్రోణి ఏర్పడినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే దక్షిణ తమిళనాడు నుంచి మధ్య, అంతర్గత కర్నాటక మీదుగా గోవా, ఉత్తర కొంకణ్‌ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో మరో ద్రోణి ఏర్పడినట్లు పేర్కొన్నది.

దీంతో తెలంగాణలో గురు, శుక్రవారాలలో గంటకు ౩౦ నుంచి 4౦ కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

శుక్రవారం నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో ఈదురు గాలులు వీస్తే అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

సంగారెడ్డి జిల్లాలో భారీ వడగండ్ల వాన

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో భారీగా వడగండ్ల వాన కురిసింది.కొహీర్ మండలం బడంపెట్ లో వడగండ్ల వాన పడుతుంది.సంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల ఈదురు గాలులు వీస్తున్నాయి.పంటలు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి లో వడగళ్ల వాన వేల ఎకరాల్లో పంట నష్టం సన్నజాజులు, గులాబీపూల తోటల కి తీవ్ర నష్టం

వడగళ్ల వర్షం

సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వడగళ్ల వాన పడుతోంది. వర్షానికి తోడు వడగళ్లు కూడా పడటంతో రోడ్లపై మంచులా పరుచుకుంది. దీంతో ప్రజలు ఆ దృశ్యాలను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరోవైపు ఈ వర్షాలు మామిడితోపాటు వరి పంటకు నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్లోని నాగోల్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మలక్పేట్తోపాటు పలుచోట్ల వర్షం కురుస్తుండగా చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై చీకటి అలుముకుంది.

అత్యధికంగా వర్షం కురిసిన ప్రాంతాలు

Exit mobile version