Site icon vidhaatha

Harish Rao | పదో తరగతి విద్యార్థులకు హరీశ్ రావు ఉత్తరాలు

Harish Rao | విధాత : పదో తరగతి పరీక్షల సందర్భంగా 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఉత్తరాలు రాయడం చర్చనీయాంశమైంది. సిద్దిపేటలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఉత్తరాలు రాశారు. ప్రస్తుతం మీ పిల్లలు కూడా పదో తరగతి చదవుతున్నారని, వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్న వేళ.. పాఠశాలల్లో బోధన పూర్తయిందని, ఉపాధ్యాయులు పాఠాలన్ని మళ్లీ రివిజన్ కూడా చేస్తున్నారని లేఖలో గుర్తు చేశారు.


కాగా.. సాయంత్రం సమయంలో.. నేను కూడా అల్పహారం అందించి ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తున్నానని, నావంతు ప్రయత్నం నేను చేస్తున్నానని, తల్లిదండ్రులుగా మీరు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి పిల్లలను టీవీలు, సెల్ ఫోన్లకు దూరంగా ఉంచండని కోరారు. ఈ రెండు నెలల పాటు విందులు, వినోదాలు, ఫంక్షన్లకు తీసుకెళ్లొద్దని, ఇంటి వద్దె ఉంచి.. ఇబ్బంది కలగించకుండా చదువుకునేలా సహకరించండని సూచించారు. కష్టంగా కాకుండా.. ఇష్టంగా చదివించండని, మీ పిల్లల బంగారు భవితకు బాటలు వేయండని అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు హరీశ్ రావు లేఖలు రాశారు.

Exit mobile version