విధాత: మొదట్లో జగన్ కాస్త అయిష్టంగానే దగ్గరకు తీసిన ఆ సీనియర్ మంత్రి ఇప్పుడు ఏకంగా మొత్తం కేబినెట్లో టాపర్ అయ్యారు. నచ్చని శాఖ ఇచ్చారంటూనే ఆ శాఖను పటిష్ట పరిచి అధినేత వద్ద మంచి మార్కులు కొట్టేశారు. అవును విద్యాశాఖ నాకు వద్దని కినుక వహించిన సీనియర్ మంత్రి బోత్స సత్యనారాయణ ఇప్పుడు టాప్ స్కోరర్ అయ్యారు.
బొత్స తరువాత వైద్య శాఖ మంత్రి విడదల రజని రెండవ స్థానంలో ఉంటే పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మూడవ ర్యాంక్ మంత్రిగా ఉన్నారు. ఇక బొత్స విషయానికి వస్తే కేబినెట్
విస్తరణలో తనకు విద్యా శాఖ లభించడం పట్ల మొదట్లో కొంత అసంతృప్తికి లోనయ్యారని వార్తలు వచ్చాయి.
విపక్షాలు సైతం బొత్సకు ఆ శాఖ ఎందుకూ అని వెక్కిరించాయ్. కానీ బొత్స మాత్రం తన శాఖపై నిబద్ధత చూపించారు అని సీఎం వద్దకు రిపోర్ట్ ఉందట. అందుకే మంచి ఆయనకు ఈ ప్రశంసలు దక్కాయని అంటున్నారు. పార్టీకి ఏదైనా సమస్య, ఓ క్లిష్ట పరిస్థితి వచ్చినపుడు సైతం బొత్స రంగంలోకి దిగి పరిస్థితి చక్కదిద్దుతుంటారు. పార్టీకి ట్రబుల్ షూటర్ గా నిలుస్తున్నారు.