Site icon vidhaatha

హైద‌రాబాద్‌లో ఆది, సోమ‌వారాల్లో భారీ వ‌ర్షాలు..!

విధాత : హైద‌రాబాద్ శ‌నివారం సాయంత్రం నుంచి రాత్రి వ‌ర‌కు ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది. అత్య‌ధికంగా జూబ్లీహిల్స్‌లో 46.3 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది. ఆది, సోమ‌వారాల్లో కూడా హైద‌రాబాద్‌లో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది.

ఈ రెండు రోజులు న‌గ‌ర వాసులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో న‌గ‌రంలో ఎల్లో అల‌ర్ట్ జారీ చేశారు.

శ‌నివారం రాత్రి ఖైర‌తాబాద్, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, అత్తాపూర్‌, హ‌ఫీజ్‌పేట్‌, మియాపూర్‌, గ‌చ్చిబౌలి, లింగంప‌ల్లి, మూసాపేట్, షేక్‌పేట్‌తో పాటు ప‌లు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. రోడ్ల‌పై వ‌ర్ష‌పు నీరు నిలిచివ‌పోడంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌లిగింది. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి.

Exit mobile version