Heavy Rains |
రాజధాని హైదరాబాద్ సహా తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాలో మంగళవారం కుండపోత వర్షం కురిసింది. మెరుపులు, ఉరుములు, ఈదురుగాలులతో వర్షం బీభత్సం సృష్టించింది. పలుచోట్ల పిడుగులకు మూగజీవాలు బలయ్యాయి. కోతకు వచ్చిన వరి దెబ్బతినగా.. కోసి కుప్పలుపోసిన ధాన్యం తడిసిముద్దయ్యింది. దాంతో అన్నదాతన్న కన్నీటి పర్యంటమవుతున్నారు. ఈదురుగాలులకు మామిడికాయలు రాలిపోవడంతో మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. హైదరాబాద్ మంగళవారం రాత్రి నుంచి వర్షం కురుస్తున్నది. ఆర్సీపురం, గచ్చిబౌలి, గాజులరామారం, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో గంట వ్యవధిలోనే ఐదు సెంటీమీటర్లకుపైగా వర్షాపాతం రికార్డయింది. ఈదురుగాలులకు హుస్సేన్‌సాగర్‌లో భాగమతి బోట్ పక్కకు కొట్టుకుపోయింది. ఈ సమయంలో బోట్‌లో 40 మంది పర్యాటకులు ఉన్నారు. ఎలాగోలా బోట్ ఒడ్డుకు తిరిగి రావడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.
భారీ వానకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ క్రమంలో అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇండ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లోకి వాన నీరు చేరింది. చందానగర్‌లో ఇండ్లలోకి చేరు చేరగా.. కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో ఓ కారుపై చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. అత్యవసర పరిస్థితుల్లో 040-29555500 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని ఈవీడీఎం అధికారులు కోరారు.
జిల్లాల్లోనూ దంచికొట్టిన వాన..
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మంగళవారం రాత్రి వర్షం దంచికొట్టింది. వానకు ఈదురుగాలులు సైతం తోడయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో 6 సెంటీమీటర్ల వర్షం నమోదైంది.
Never Witnessed This Kind of Rain in my weather Blogging