Telangana | తెలంగాణ వ్యాప్తంగా నిన్న వర్షాలు దంచికొట్టిన సంగతి తెలిసిందే. వికారాబాద్( Vikarabad ), సంగారెడ్డి( Sangareddy ) జిల్లాల్లో నిన్న కురిసిన భారీ వడగళ్ల వాన( Hailstorm ) బీభత్సం సృష్టించింది. దీంతో ఆ రెండు జిల్లాల్లో ఎక్కడా చూసిన వడగళ్ల కుప్పలే కనిపించాయి. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాలు కశ్మీర్( Kashmir )ను తలపించాయి.
పశ్చిమ బెంగాల్( West Bengal ), ఒడిశా( Odisha ) మీదుగా ఉత్తర కోస్తా వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి, దక్షిణ తమిళనాడు నుంచి మధ్య, అంతర్గత కర్ణాటక, గోవా మీదుగా ఉత్తర కొంకణ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్ర, శని, ఆదివారాల్లో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
శుక్రవారం రోజున ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. శనివారం నాడు ఉమ్మడి రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో, ఆదివారం రోజు అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్( Yellow Alert ) జారీ చేసింది.