106 మంది సెర్ఫ్, ఉపాధి ఉద్యోగులకు హైకోర్టు ఊరట

సిద్దిపేట సెర్ఫ్‌ ఉద్యోగుల సస్పెన్షన్‌పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఎన్నికల నియమాళిని ఉల్లంఘించి మెదక్ బీఆరెస్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న కారణంతో 106 మందిని ఇటీవల జిల్లా కలెక్టర్ మనుచౌదరి వారిని సస్పెండ్ చేశారు

  • Publish Date - April 19, 2024 / 04:07 PM IST

సస్పెన్షన్‌పై స్టే

విధాత, హైదరాబాద్: సిద్దిపేట సెర్ఫ్‌ ఉద్యోగుల సస్పెన్షన్‌పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఎన్నికల నియమాళిని ఉల్లంఘించి మెదక్ బీఆరెస్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న కారణంతో 106 మందిని ఇటీవల జిల్లా కలెక్టర్ మనుచౌదరి వారిని సస్పెండ్ చేశారు. వీరిలో 38 సెర్ఫ్‌ ఉద్యోగులు, 68 మంది ఉపాధి హామీ పథకానికి చెందిన వారున్నారు.

ఉద్యోగుల సస్పెన్షన్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్‌కు లేదని సెర్ఫ్‌ ఉద్యోగుల తరపున హైకోర్టు న్యాయవాది చంద్రశేఖర్‌ వాదనలు వినిపించారు. దీంతో హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు జూన్ 18కి వాయిదా వేసింది.

Latest News