Site icon vidhaatha

HIndi | మీ.. మీ.. భాష‌లను బ్రాకెట్‌లో పెట్టుకోండి.. దక్షిణాదిపై హిందీ పెత్తనం: కేంద్రం ఆదేశాలు జారీ

విధాత‌: దక్షిణాది రాష్ట్రాలపై హిందీ ప్రాంత పెత్తనాన్ని ఒక పథకం ప్రకారం పెంచుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఒకే భాష, ఒకే పార్టీ , ఒకే వ్యాపార వర్గం అనే దిశగా కేంద్రం పావులు కదుపుతున్నది. తాజాగా పెరుగు ప్యాకెట్లపై ప్రాంతీయ భాషలో కాకుండా హిందీలో ’దహీ‘ అని ముద్రించాలని కేంద్ర ప్రభుత్వ భద్రతా ప్రమాణాల సంస్థ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా) ఆదేశాలు జారీ చేసింది. కావాలనుకుంటే ప్రాంతీయ భాషలో పక్కన బ్రాకెట్లలో పెట్టుకోవచ్చునని దయదలచి అనుమతించింది.

దీంతో కర్ణాటక పాల సమాఖ్య వారు ఆగ్రహంగా ఉన్నారు. దహీ అని హిందీలో ప్రధానంగా పెట్టి కన్నడ భాషలో తమ పదం మొసరు అని పక్కన బ్రాకెట్లలో పెట్టడం అవమానకరం అని వారంటున్నారు.

తమిళనాడు సహకార పాల ఉత్పత్తి దారుల సమాఖ్యకు కూడా ఇటువంటి ఆదేశాలే అందాయి. తమిళంలో తైరు అనే పదం పక్కన బ్రాకెట్లలో పెట్టుకోవచ్చు. కానీ ప్రధానమైన పేరు మాత్రం హిందీలో దహీ అని ఉండాలట. అన్న పానీయాలతో పాటు అన్నీ హిందీలో అలవాటు చేయాలనేదే మోదీ ప్రభుత్వ విధానంగా కనిపిస్తున్నది.

Exit mobile version