Site icon vidhaatha

Mahmood Ali | నూతన పోలీస్ స్టేషన్ భవనాలు ప్రారంభించిన.. హోం మంత్రి మెహమూద్ అలీ

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో నిర్మించిన నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర హోం శాఖ మంత్రి మెహమూద్ అలీ (Home Minister Mahmood Ali) శనివారం ప్రారంభించారు. అనంతరం టేకుమట్ల పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించగా, పలిమెల పోలీస్ స్టేషన్‌ను వర్చువల్గా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, పోలీస్ హౌసింగ్ సోసైటీ చైర్మన్ కోలేటి దామోదర్, డీజీపీ అంజని కుమార్, భూపాలపల్లి, వరంగల్, జిల్లా ప్రజా పరిషత్ చైర్పెర్సన్లు శ్రీ హర్షిణీ, గండ్ర జ్యోతి, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా, జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

హోం మంత్రిని కలిసిన సీపీ

భూపాల్ పల్లి జిల్లా పర్యటన కు వెళ్తున్న హోం మంత్రి మహమూద్ అలీని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హనుమకొండలో మర్యాదపూర్వకంగా కలిసి పూలగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

Exit mobile version