మేషం : ఈ రాశివారు తమ ఆరోగ్యం గురించి శ్రద్ధవహించాలి. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండటం మంచిది.
వృషభం : ఈ రాశివారు అన్నికార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. ఎలాంటి శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందడంతో పాటు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.
మిథునం : ఈ రాశివారు కొన్ని కార్యాలను పట్టుదలతో పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతారు. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
కర్కాటకం : ఈ రాశివారికి అనారోగ్య బాధలు అధికమవుతాయి. వ్యాపార రంగంలోని వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అనవసర భయానికి లోనవుతారు.
సింహం : ఈ రాశివారు మోసపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశం ఉంది. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది.
కన్య : ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కలహాలకు దూరంగా ఉండటం మంచిది.
వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు.
తుల : ఈ రాశివారు అనారోగ్య సమస్యలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలు ఉంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.
వృశ్చికం : ఈ రాశివారు సంతోషంగా ఉంటారు. శుభవార్తలు వింటారు. ఆర్థికంగా బలపడటమే కాకుండా, తోటి వారి ప్రశంసలు కూడా అందుకుంటారు. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు.
ధనుస్సు : ఈ రాశివారికి స్త్రీల మూలకంగా ధనలాభం కలుగుతుంది. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది.
మకరం : ఈ రాశివారు తలపెట్టే శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. అద్భుతమైన అవకాశాలు పొందుతారు. ఊహించని విధంగా చేతికి డబ్బు అందుతుంది.
కుంభం : ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. దైవదర్శనం చేసుకోవడంతో పాటు శుభవార్తలు వింటాచు. ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది.
మీనం : ఈ రాశివారికి వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.