విధాత: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, మూసాపేట, కూకట్ పల్లి, యూసుఫ్ గూడ, అమీర్‌పేట, పంజాగుట్ట, సోమాజి గూడ, ఎస్ఆర్‌నగర్‌లలో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 4.6 సెంటీమీటర్ల వర్షాపాతం, చందానగర్-4.3 సెం.మీ., అత్తాపూర్-2.3 సెం.మీ, మియాపూర్-1.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది.