నా భార్య నన్ను కొట్టి, వాత‌లు పెడుతోంది.. ప్లీజ్ విడాకులిప్పించండి..!

భ‌ర్త‌లు చిత్రహింస‌లు పెడుతున్నార‌ని ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునే ఘ‌ట‌నలు నిత్యం వెలుగు చూస్తుంటాము. కానీ ఈ సంఘ‌ట‌న‌లో మాత్రం కేసు రివ‌ర్స్ అయింది

  • Publish Date - April 19, 2024 / 05:01 PM IST

విధాత‌: భ‌ర్త‌లు చిత్రహింస‌లు పెడుతున్నార‌ని ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునే ఘ‌ట‌నలు నిత్యం వెలుగు చూస్తుంటాము. కానీ ఈ సంఘ‌ట‌న‌లో మాత్రం కేసు రివ‌ర్స్ అయింది. హైద‌రాబాద్‌కు చెందిన ఓ వ్య‌క్తి త‌న భార్య త‌న‌ను కొడుతోంది, చిత్ర‌హింస‌ల‌కు గురిచేస్తోందంటూ ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డాడు. వివ‌రాల్లోకి వెళితే కొంప‌ల్లిలో నివాస‌ముంటున్న న‌గేష్ అనే వ్య‌క్తి జయభేరి పార్క్ చెరువులోకి దిగి నానా రచ్చ చేశాడు. అత‌న్ని బ‌య‌ట‌కు తీసుకు రావ‌డానికి ప్ర‌య‌త్నించిన స్థానికుల‌కు చుక్క‌లు చూపించాడు.

‘నా భార్య నన్ను కొడుతోంది. నాకు విడాకులు ఇప్పించండి. లేదంటే సచ్చిపోతా’ అని డిమాండ్ చేశాడు. న‌న్ను కొట్ట‌డమే కాకుండా వాత‌లు కూడా పెడుతుంద‌ని త‌న గోడు వెల్ల‌బోసుకున్నాడు. త‌న‌ను కొట్టిన తాళూకు గాయాల‌ను చూపించాడు. త‌న పిల్ల‌ల దెగ్గ‌ర‌కు కూడా వెల్ల‌నియ్య‌డం లేద‌ని, పిల్ల‌ల‌కు డాడీ చ‌నిపోయాడ‌ని చెప్పాల‌ని నేర్పిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ప్ర‌తిరోజు టార్చ‌ర్ పెడుతోంద‌ని ఎలాగైన త‌న నుంచి విడాకులు ఇప్పించండంటూ న‌గేష్ వాపోయాడు. ఈ విష‌యాన్నంతా వీడియో తీసిన స్థానికులు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Latest News