- ఐటీలో మాస్టర్స్ కోసం వెళ్లిన షేక్ ముజమ్మిల్ అహ్మద్
- మృతదేహాన్ని హైదరాబాద్‌కు పంపించేలా ఏర్పాట్లు చేయాలని
- విదేశీ వ్యవహారాల మంత్రి అభ్యర్థించిన కుటుంబీకులు
విధాత: కెనడాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి షేక్ ముజమ్మిల్ అహ్మద్ గుండెపోటుతో మరణించాడు. తమ కుమారుడి మృతదేహాన్ని హైదరాబాద్‌కు పంపించేలా ఏర్పాటు చేయాలని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్‌ను మృతుడి కుటుంబసభ్యులు అభ్యర్థించారు.
పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన అహ్మద్ (25) ఒంటారియోలోని కిచెనర్ సిటీలోని వాటర్‌లూ క్యాంపస్‌లోని కోనెస్టోగా కాలేజీలో ఐటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. గత వారం నుంచి అహ్మద్ జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అహ్మద్‌కు గుండెపోటు రావడంతో మరణించాడని అతని స్నేహితులు తెలిపారు. ఈ మేరకు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.