Site icon vidhaatha

SIT I నోటీసులు రాలేదు.. ఈరోజు నేను హాజరుకాలేను: బండి సంజయ్‌

విధాత‌: సిట్‌(SIT) కార్యాలయం నుంచి తనకు ఎలాంటి నోటీసు(Notice)లు రాలేదని, నోటీసులోని విషయాలు చూడలేదని నిస్సందేహంగా తెలియజేస్తున్నానని బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సిట్‌కు లేఖ రాశారు. పార్లమెంటు సమావేశాలకు హాజరవ్వాల్సిన బాధ్యత నాకు ఉన్నది.

ఇవాళ సిట్‌ ఎదుట హాజరుకావాల్సిందిగా వార్త, కథనాల ద్వారా అర్థమైంది. పార్లమెంటు సమావేశాల దృష్ట్యా ఇవాళ నేను రాలేను. సిట్‌ విచారణకు మరో తేదీ ఇవ్వాలని సంజయ్‌ ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

Exit mobile version