Site icon vidhaatha

Komatireddy | ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నా: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komatireddy |

విధాత: నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని తిప్పర్తి మండలం తిప్పాలయగూడెంలో త్రిపుర సుందరి (తిప్పలమ్మ) అమ్మవారి మహోత్సవం శోభాయాత్ర నుంచే నా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నానని మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు

తిప్పలమ్మ అమ్మవారు చాలా శక్తివంతమైన మహిమ గల అమ్మవారని, అమ్మను దర్శించుకొని ప్రచారాన్ని ప్రారంభిస్తున్నానన్నారు. తిప్పర్తి అంటేనే నా సొంత ఊరు లెక్క అని, గతంలో ఇక్కడి ప్రజలు నన్ను గొప్పగా ఆదరించారని, మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడినన్నారు.

రేపటి నుంచి ఊరూరు, ఇల్లిల్లు తిరుగుతానని, పేదలను, దళిత, బహుజన బిడ్డలందరిని కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. ప్రభుత్వ నిధులతో కాకుండా తన సొంత నిధులతో మీ ఎవ్వరికీ ఆపదొచ్చినా అదుకుంటానని, ప్రతి కుటుంబానికి సహాయంగా నిలబడుతానన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి రావాలని అమ్మవారిని వేడుకున్నానన్నారు. నేను ఎక్కడి వెళ్లిన, ఏ పదవులు నిర్వహించినా చివరకు వచ్చేది నల్లగొండకే అన్నారు. పదవులు ఎవరికి ఎప్పుడు శాశ్వతం కాదని, ప్రజల ఆదరణ, అభిమానాలే నాకు ముఖ్యమన్నారు.

Exit mobile version