Site icon vidhaatha

పవన్ కల్యాణ్‌ సీఎం అభ్యర్థి అయితే.. టీడీపీతో పొత్తుకు రెడీ!

ఉన్నమాట: కొన్ని షాపుల్లో పండగలపూట గొప్పగొప్ప ఆఫర్లు ఇస్తుంటారు. నిజమే అనుకుని మనం ముందుకు పోతే అక్కడ కనీకనిపించని సైజులో స్టార్ మార్కు పెట్టి షరతులు వర్తిస్తాయి అని రాసి ఉంటుంది. దీంతో మనం ఉసూరనుకుంటూ వెనక్కి వస్తుంటాం.. ఆంధ్ర పాలిటిక్స్ కూడా అచ్చం అలాగే కనిపిస్తోంది.

టీడీపీతో పొత్తుకు జనసేన సిద్ధంగా ఉందట కానీ పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలట. అసలు ఎన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది.. ఎన్ని గెలుస్తారు.. అసలు పవన్ గెలుస్తారా.. ఆయనను చంద్రబాబు గెలవనిస్తారా.. వెనక నుంచి గోతిలు తవ్వి ఓడ గొడతారా..ఇవన్నీ బేరీజు వేయకుండానే పవన్ ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ప్రకటించాలని కోరుతున్నారట.

తమ్ముళ్ళకు ఎలా వినిపిస్తుందో తెలియదు కానీ పొత్తుల కథ ముందుకు సాగుతున్న వేళ జన సైనికుల బలమైన కోరికగా దీనిని చూడాలని అంటున్నారు. పవన్ కళ్యాణ్ మద్దతుతో 2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ ఆ తరువాత చింతమనేని ప్రభాకర్.. గోరంట్ల బుచ్చయ్యచౌదరి వంటి వారు పవన్ ను ఎంత చులకనగా చూశారన్నది జనసైనికులకు గుర్తు ఉంది.

వాడుకున్న తరువాత తమను ఇగ్నోర్ చేస్తారన్న భయమూ ఉంది. అందుకే ముందుగానే పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతున్నారు. అయితే అపర మేథావి చంద్రబాబు వద్ద వీరి ఎత్తులు సాగుతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Exit mobile version