IKP, VOAల పాదయాత్ర.. జీతాలు చెల్లించకుంటే నిరవధిక సమ్మె.. CITU హెచ్చరిక

విధాత‌: తెలంగాణ ఐకెపి, వివో ఏ ఉద్యోగుల సంఘం సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 16, 17, 18 తేదీల్లో టోకెన్ సమ్మె నిర్వహించి శనివారం రోజు టీటీడీ కళ్యాణమండపం నుంచి నూతన కలెక్టరేట్ భవనం వరకు పాదయాత్రగా వెళ్లారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడుతూ సెర్ప్ సంస్థలో గత 20 సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారిని serp ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగ […]

  • Publish Date - March 18, 2023 / 02:20 PM IST

విధాత‌: తెలంగాణ ఐకెపి, వివో ఏ ఉద్యోగుల సంఘం సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 16, 17, 18 తేదీల్లో టోకెన్ సమ్మె నిర్వహించి శనివారం రోజు టీటీడీ కళ్యాణమండపం నుంచి నూతన కలెక్టరేట్ భవనం వరకు పాదయాత్రగా వెళ్లారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడుతూ సెర్ప్ సంస్థలో గత 20 సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారిని serp ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, 10 లక్షల సాధారణ ఆరోగ్య భీమా పథకం అమలుపరచాలని, ఆన్‌లైన్ పనులు రద్దు చేయాలని, ఐడి కార్డులు, యూనిఫార్మ్స్, ఇప్పించాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాల సభ్యులకు ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పించాలని ,మహిళా సంఘాలకు బ్యాంకు విఎల్ఆర్, శ్రీనిధి విఎల్ఆర్ డబ్బులు తిరిగి చెల్లించాలని, ఆభయ హస్తం డబ్బులు అందరికీ తిరిగి చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం రూ 3900 ఇస్తూ వారి శ్రమను దోచుకొని ప్రభుత్వం తమాషా చూస్తుందన్నారు. జీతాలు పెంచి కేసీఆర్ వాగ్దానం అమలు చేయకపోతే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఆయన హెచ్చరించారు.

తెలంగాణ ఐకెపి వివో ఏ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు మంజుల, భీమయ్య, వష్యా బేగం మాట్లాడుతూ వివో లతో సంబంధం లేని పనులు చేయించరాదని, కనీస వేతనాలు అమలు చేయాలని, అధికారుల వేధింపులు అరికట్టాలని, వివోఏలకు సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలని, అదనపు పనులకు అదనపు వేతనం ఇవ్వాలని, లేనిచో నిరవధిక సమ్మె చేస్తామని వారు హెచ్చ‌రించారు. కార్య‌క్ర‌మంలో సిఐటియు నాయకులు బి చంద్రకాంత్, రాజ్ కుమార్, వివో ఏ నాయకులు ధర్మా, శ్రీలత, ఆంజనేయులు, మొగులయ్య కృష్ణ ,వెంకటేష్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

టిటిడి కళ్యాణమండపం నుంచి పాదయాత్రగా వన్ టౌను, క్రిస్టియన్ పల్లి మీదుగా కలెక్టరేట్ చేరుకొని ధర్నా నిర్వహించి కలెక్టరేట్ ప్రతినిధిగా ఏవో శంకర్ కలెక్టరేట్ బయటకు వచ్చి వివో లతో చర్చించి మెమొరండం స్వీకరిస్తూ జిల్లా పరిధిలోని సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామని, మిగతా డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతామని, కలెక్టర్ పిడితో మాట్లాడి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఆర్డిఏ ఏవో కూడా వచ్చి మెమోరాండం స్వీకరిస్తూ పిడి యాదయ్యతో చర్చించి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి స్థానిక సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కార్యక్రమాన్ని ముగిసినట్లు వారు ప్రకటించారు.

Latest News