Nalgonda: స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని.. IKPలు, VOAలు, పశుమిత్రలు ధ‌ర్నా

విధాత: ఐకేపీలు, వివోఏలు తమ సమస్యలు పరిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా మండల పరిషత్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. పశుమిత్రలు జిల్లా డిఆర్డిఏ కార్యాలయం ఎదుట శనివారం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు. ఐకెపి వివో ఏ లను ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం, ఆరోగ్య భీమా కల్పించాలని కోరారు. అలాగే అభయ హస్తం ఫించన్ మొత్తాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పశుమిత్రలను ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం, […]

  • Publish Date - March 18, 2023 / 02:20 PM IST

విధాత: ఐకేపీలు, వివోఏలు తమ సమస్యలు పరిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా మండల పరిషత్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. పశుమిత్రలు జిల్లా డిఆర్డిఏ కార్యాలయం ఎదుట శనివారం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు. ఐకెపి వివో ఏ లను ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం, ఆరోగ్య భీమా కల్పించాలని కోరారు. అలాగే అభయ హస్తం ఫించన్ మొత్తాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

పశుమిత్రలను ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, విధి నిర్వహణకు అవసరమైన పరికరాలు ప్రభుత్వమే అందించాలని డిమాండ్ చేశారు. ఆయా ఆందోళన కార్యక్రమాల్లో జిల్లా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి మల్లయ్య, సిఐటియు జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ , జిల్లా కార్యదర్శి దండంపల్లి సత్తయ్య , ఆ సంఘాల యూనియన్ నాయకులు పి.మనీషా, సునీత పాల్గొన్నారు.

Latest News