- ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి రూ.10 లక్షల సీడీపీ నిధుల కేటాయింపు
విధాత, మెదక్ బ్యూరో: జిల్లా కేంద్రమైన మెదక్ లోనీ ఇందిర పూరి కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి సీడీపీ నిధులు రూ.10 లక్షలు మంజూరు చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ , కౌన్సిలర్ మామిల్ల ఆంజనేయులతో కలసి ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఇంద్రపురి కాలనీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, అలాంటి కాలనీకి ఏదైనా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కమ్యూనిటీ హాల్ లేక ఇబ్బందులు ఉన్నాయని కాలనీ పెద్దలు తన దృష్టికి తీసుకురాగా కమ్యూనిటీ హాల్‌ను తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి మంజూరు చేశానని ఎమ్మెల్సీ తెలిపారు. భవిష్యత్తులోనూ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు గోపాల్ రావు, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు తడెపు సోములు, సర్పంచులు దేవా గౌడ్, మహిపాల్ రెడ్డి, యామి రెడ్డి, ఉప సర్పంచ్ అజయ్ గౌడ్, మాజీ కౌన్సిలర్ శేఖర్ గౌడ్, కాలనీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, జైపాల్ రెడ్డి, నర్సింహా రెడ్డి, హన్మంత్ రెడ్డి, సిద్దిరాములు, స్వామి, రాం రెడ్డి, ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ గౌడ్, జయరాములు, కృష్ణ, తదితరులు కూడా పాల్గొన్నారు.