Site icon vidhaatha

Covid Cases Today | దేశంలో 157 కు చేరిన కొవిడ్ కేసులు

Covid Cases Todayవిధాత‌: దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త కొవిడ్ కేసులు 157 న‌మోద‌య్యాయి. ఇద్ద‌రు మ‌ర‌ణించారు. భారతదేశంలో ఒకేరోజు 157 కొవిడ్-19 కేసులు రికార్డ‌యిన‌ట్టు, యాక్టివ్ కేసుల సంఖ్య 1,496కు పెరిగిన‌ట్ట కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. గ‌డిచిన 24 గంటల వ్యవధిలో రెండు కొత్త మరణాలు, ఛత్తీస్‌గ‌ఢ్‌లో ఒక‌రు, ఉత్తరప్రదేశ్‌లో మ‌రొక‌రు చ‌నిపోయిన‌ట్టు ఉదయం 8 గంటలకు విడుద‌ల‌చేసిన హెల్త్ బులెటిన్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.


గ‌త ఏడాది డిసెంబర్‌ 5 వరకు రోజువారీ కేసుల సంఖ్య రెండంకెలకు పడిపోయింది. కొత్త వేరియంట్ JN.1 వ‌చ్చిన తర్వాత, చల్లని వాతావరణ పరిస్థితుల కార‌ణంగా క‌రోనా వ్యాప్తి క్ర‌మంగా పెరగడం ప్రారంభమైంది. డిసెంబర్ 31న అత్యధికంగా 841 కేసులు నమోదయ్యాయి. ఇది మే 2021లో నమోదైన గరిష్ఠ కేసుల్లో 0.2 శాతం అని అధికారిక వర్గాలు తెలిపాయి.


యాక్టివ్‌గా ఉన్న 1,496 కేసుల్లో ఎక్కువ శాతం మంది (సుమారు 92 శాతం) హోమ్ ఐసోలేషన్‌లో కోలుకుంటున్నారు. 2020 ప్రారంభంలో దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మందికిపైగా ప్రజలు కొవిడ్ బారిన ప‌డ్డారు. 5.3 లక్షల మందికి పైగా మరణించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య జాతీయ రికవరీ రేటు 98.81 శాతంతో 4.4 కోట్లకు పైగా ఉన్న‌ది. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల డోస్‌ల కొవిడ్‌ వ్యాక్సిన్లు వేశారు.

Exit mobile version