Site icon vidhaatha

Indian Army Recruitment | ఇండియన్‌ ఆర్మీలో 196 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. పెళ్లి కాకుంటే అర్హులు..!

Indian Army Recruitment | షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సు టెక్ ప్రవేశాలకు ఇండియన్‌ ఆర్మీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు కోర్సులో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సు టెక్‌లో ప్రవేశానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా.. కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలంటే అవివాహితులై ఉండాలి. స్త్రీ, పురుషులిద్దరికీ వివాహితులైతేనే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

కానీ, భారత సాయుధ దళాల్లో పనిచేసి విధుల్లో భాగంగా అమరులైన జవాన్ల భార్యలు దరఖాస్తు చేసుకోవచ్చు. వారు కనీసం ఇంజినీరింగ్‌ డిగ్రీ పూర్తి చేసి.. లేదంటే ఫైనల్‌ ఇయర్‌లోనైనా ఉండాలి. దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేది జులై 19. అధికారిక వెబ్ సైట్ joinindianarmy.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆర్మీ సూచించింది.

ఇదిలా ఉండగా.. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 196 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 175 పోస్టులు పురుషులకు, మరో 19 పోస్టులు మహిళలకు కేటాయించారు. అభ్యర్థుల వయస్సు 2024 ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి 20 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసినవారు కానీ, చివరి సంవత్సరంలో ఉన్నవారు కానీ దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

మొదట ఇండియన్‌ ఆర్మీ వెబ్‌సైట్ http://joinindianarmy.nic.in లోకి లాగిన్‌ కావాలి. క్యాప్చ ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత ‘Officer Entry’ బటన్‌ కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేయాలి. యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ అడుగుతుంది. అల్‌రెడీ యూజర్‌ నేమ్‌ ఉంటే లాగిన్‌ అవ్వాలి. కొత్తగా దరఖాస్తు చేసుకుంటే మాత్రం యూజర్‌ క్రియేట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత వ్యక్తిగత వివరాలతో రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్‌ను ఫిల్‌ చేసి.. సబ్మిట్ చేయలి. అనంతరం ఆ ఫామ్‌ను డౌ‌న్‌లోడ్‌ చేసుకొని సేవ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్‌ను ప్రింట్ తీసి భద్రపర్చుకోవాలి.

Exit mobile version