Site icon vidhaatha

Indian Railway | కార్మికులు, పేదలకు గుడ్‌న్యూస్‌..! జనతా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రాబోతున్నయ్‌..! పరుగులుపెట్టేది ఎప్పటి నుంచో తెలుసా..?

Indian Railway |

భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రతి తరగతికి చెందిన వారి కోసం రైళ్లను నడుపుతున్నది. దాంతో రైలు ప్రయాణం మరింత చౌకగా మారనున్నది. పేదలు, కూలీల కోసం ప్రత్యేకంగా రైళ్లను తీసుకురావాలని నిర్ణయించింది. త్వరలో జనతా ఎక్స్‌ప్రెస్‌ను నడపాలని నిర్ణయించింది. ఈ రైళ్లను కార్మికుల కోసం ప్రత్యేకంగా నడుపనున్నది. కార్మికుల రాకపోకలు ఎక్కువగా ఉండే మార్గాల్లో ఈ రైళ్లను ఎక్కువగా తీసుకురానున్నది. ఈ రైలులో 22 నుంచి 26 కోచ్‌ల వరకు ఉంటుంది.

2024 నాటికి రైళ్లు ప్రారంభం..

ప్రత్యేకంగా కార్మికులు, పేదలకు కోసం తీసుకువస్తున్న ఈ జనతా ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్‌, జనరల్‌ కోచ్‌లే ఎక్కువగా ఉండనున్నాయి. 2024 నాటికి ఈ రైళ్లను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు రైల్వే తెలిపింది. ఈ రైళ్ల ఛార్జీలు సాధారణ రైళ్ల కంటే తక్కువగా ఉండనున్నట్లు తెలుస్తున్నది.

ఆయా రైళ్లు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, పంజాబ్, అసోం, గుజరాత్‌, ఢిల్లీ మధ్య ఎక్కువగా నడువనున్నట్లు ఓ రైల్వే అధికారి తెలిపారు. చాలా మంది కార్మికులు, చేతివృత్తులవారు, కార్మికులు ఇతర ఆయా రాష్ట్రాలకు వచ్చి తిరిగి ఇండ్లకు వెళ్లేందుకు ఉపయోగపడనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

కార్మికులు ఇబ్బందిపడకుండా..

సమాచారం ప్రకారం.. వలస కార్మికులు పెద్ద సంఖ్యలో ప్రయాణించే నగరాల మధ్య రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. కార్మికులు పెద్దగా ఇబ్బందులు పడకుండా ఉండేలా ఈ రైళ్లను ప్రధానంగా ఆయా మార్గాల్లో నడుపనున్నట్లు సంబంధి వర్గాలు పేర్కొన్నాయి. ఆయా రైళ్లలో టికెట్లను పొందడం కుడా సులభంగానే ఉంటుందని తెలుస్తుంది.

ఈ రైళ్లను పండుగ సమయంలో నడిచే రైళ్లకు భిన్నంగా నడుపుతామని, ఏడాది పొడవునా నడపనున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. దీంతో పాటు జనరల్ కోచ్‌లలో ప్రయాణించే వారికి సరసమైన ధరలకు ఆహారంతో పాటునీటిని అందించాలని ఇటీవల రైల్వేశాఖ నిర్ణయించింది.

Exit mobile version