Site icon vidhaatha

Indigo flight | పాక్‌ ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్‌..! ప్రయాణికుడి మృతి..!

Indigo flight | దోహా వెళ్తున్న ఇండిగో విమానాన్ని పాక్‌లోని కరాచీలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. ప్రయాణికుడి మెడికల్‌ ఎమర్జెన్సీ నేపథ్యంలో విమానాన్ని మళ్లించినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. వివరాల్లోకి వెళితే.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 9E1736 విమానం ఢిల్లీ నుంచి ఖతార్ రాజధాని దోహాకు బయలుదేరింది.

కొద్దిసేపటి తర్వాత విమానంలో ప్రయాణికుడు ఆరోగ్య సమస్యలపై సిబ్బందికి తెలిపాడు. దీంతో విమానాన్ని సమీపంలో ఉన్న కరాచీ విమానాశ్రయానికి మళ్లించేందుకు అక్కడి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు సమాచారం అందిస్తూ.. అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరాడు. దీంతో కరాచీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విమానాన్ని ల్యాండ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. విమానాన్ని ల్యాండింగ్‌ చేస్తున్న సమయానికే సదరు వ్యక్తి మృతి సమాచారం. సదరు వ్యక్తిని నైజిరియాకు చెందిన అబ్దుల్లా (60)గా గుర్తించారు. ఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విచారం వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబానికి సంతాపం ప్రకటించింది. ఇతర ప్రయాణికులకు తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఎయిర్‌లైన్స్‌ చెప్పింది.

Exit mobile version