- డీపీఆర్ సిద్ధం చేయాలని సూచన
- వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమావేశం
- ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డెఫిబిలేటర్స్ ఏర్పాటు
- గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రావీణ్య
Integrated Command Control Center in Warangal City
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ మహానగరంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రావీణ్య తెలిపారు.
కుడా కార్యాలయ సమావేశం మందిరంలో స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ స్టేక్ హోల్డర్లతో సోమవారం జరిగిన సమావేశంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు ఆయా శాఖల నుండి అవసరమైన సమాచార సేకరణ చేశారు. ఈ సందర్భంగా ప్రావీణ్య మాట్లాడుతూ ఇప్పటికే నగరపాలక సంస్థ నూతన సమావేశ మందిర భవనం మొదటి అంతస్తులో తాత్కాలికంగా ఏర్పాటైందని అన్నారు.
రూ.98.5 కోట్ల అంచనా వ్యయం
మహా నగరంలో స్మార్ట్ సిటీ నిధులతో 98.5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఐసిసిసిలో మొత్తం సిటీ సర్వలేన్స్ నిమిత్తం సుమారు 600 కెమెరాలు, 10 జంక్షన్ల అభివృద్ధి, నగారానికి వచ్చే వాహనాల నంబర్లతో సహా గుర్తింపు ఏ ఎన్ పి ఆర్ కెమెరాలు, తదితర కంపోనెంట్ లతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
డీపీఆర్ సిద్ధం చేయండి..
పూర్తిస్థా యిలో ఏర్పాటుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రచనకు ‘సెలక్షన్ ఆఫ్ మాస్టర్ సిస్టమ్ ఇంటిగ్రేటర్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై నిపుణులు, ప్రభుత్వ శాఖల సలహాలు, సూచనలు పొందేందుకు అధికారులు వారి వారి శాఖల సమాచారం క్రోడీకరించి ఐసీసీసిలో మ్యాపింగ్ చేయుటకు పంపాలని కోరారు. అలాగే ఏరియా ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్, సీసీటీవీ సర్వైలెన్సుసిస్టమ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు, పెలికాన్ సిగ్నల్ సిస్టమ్, వేరియబుల్ మెస్సేజింగ్ సిస్టమ్, పబ్లిక్ అనౌన్సెమెంటు సిస్టమ్, ఇ-గవర్నెన్సు, ఎన్విరాన్మెంటల్ సెన్సార్ సిస్టమ్, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చించి సమర్థ నిర్వహణకు పలు సూచనలు సలహాలు స్వికరించారు.
నగరంలో ప్రధాన సెంటర్ల మ్యాపింగ్
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐ.సి.సి.సి) ఏర్పాటు కోసం. ట్రాఫిక్, లా &ఆర్డర్, కుడా, ఆర్ &బి, పబ్లిక్ హెల్త్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, కలెక్టరేట్ కార్యాలయం నుండి విచ్చేసిన వివిధ విభాగాలు, విద్య శాఖ, ఐ.సి.సి.సి లో వారి వారి అవసరాల మేరకు కెమెరాలు, సర్వే లైన్స్ లు, జంక్షన్ లు, స్మార్ట్ వాటర్ మే నేజ్మెంట్, ఎలక్ట్రికల్స్ నకు చెందిన సి.సి.ఎం.ఎస్. బాక్స్ ల ఏర్పాటు, జీ.పి.ఎస్.మ్యాపింగ్, కాల్ సెంటర్ ఏర్పాటు, మహా నగర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, నగరంలోని ఖాళీ ప్రాంతాలు, అండర్ గ్రౌండ్ యుటిలిటీ మ్యాపింగ్, బల్దియాకు సంబంధించిన వివిధ విభాగాలకు చెందిన జిడబ్ల్యూ ఎంసీ ఆప్ వివరాలను కూడా ఐసిసిసిలో మాపింగ్ చేయడం జరుగుతుంది.
వరంగల్ అదనపు కలెక్టర్ శ్రీ వాత్సవా, డిసిపి లు పుష్ప, అబ్దుల్ బారి, స్మార్ట్ సిటీ పిఎంఈ ఆనంద్ వోలెటి, ఎస్ ఈ లు ప్రవీణ్ చంద్ర, కృష్ణ రావు, సిటీ ప్లానర్ వెంకన్న కుడా సి.పి. ఓ .అజిత్ రెడ్డి
పలు సూచనలు చేసిన ఈ సమావేశంలో బల్దియా ఈఈ శ్రీనివాసరావు, రాజయ్య, రాజ్ కుమార్, పబ్లిక్ హెల్త్ శాఖ ఆర్అండ్ బి పీసీబీ శాఖల ఈఈలు, కాజీపేట ఎన్ఐటీ ఆచార్యుడు సీఎస్ఆర్కే. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డెఫిబిలేటర్స్ ఏర్పాటు
అనంతరం ఇటీవల హార్ట్ ఎటాక్ తో ప్రజలు చనిపోతున్న నేపథ్యంలో పురపాల శాఖ మాత్యుల ఆదేశాల మేరకు వరంగల్ మహానగరంలో 10 ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డెఫిబిలేటర్స్ పరికరాలు పబ్లిక్ ప్లేస్ లలో ఏర్పాటు చేయుటకు నిర్ణయించారు. ఈ క్రమంలో ఆకస్మిక గుండె ఆగిపోయిన వారికి ఏ విధంగా ఈ పరికరం ద్వారా రక్షించ వచ్చో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంబంధింత ఏజెన్సీ వారు వివరించారు.