Interim Budget 2024 | కేంద్ర ప్రభుత్వం రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు మధ్యంతర బడ్జెట్‌కు సిద్ధమవుతున్నది. అయితే, ఈ బడ్జెట్‌లో భారీ మార్పులు, పథకాలకు అవకాశం లేదని తెలుస్తుంది. అయితే, కొత్త ప్రభుత్వం తీసుకురాబోయే పూర్తి బడ్జెట్‌కు సూచనగా నిలిచే అవకాశం ఉండగా.. మధ్యంతర బడ్జెట్‌పై అంచనాలున్నాయి. బడ్జెట్‌లో అన్నివర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అదే సమయంలో మహిళలు సైతం బడ్జెట్‌పైనే దృష్టి సారించారు. ఈ సారి బడ్జెట్‌లో సాధికారతకు కేంద్రం పెద్దపీట వేస్తుందా? లేదా ? చర్చనీయాంశంగా మారింది.
అయితే, ఈ ఏడాది బడ్జెట్‌లో ఇందిరాగాంధీ జాతీయ వితంతు పింఛను పథకం, నిర్భయ ఫండ్, సక్షం అంగన్‌వాడీ పోషణ్‌కు కేటాయింపులతో మహిళా సంక్షేమ పథకాలపై కేంద్రం దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తున్నది. వీటితో పాటు పలు మిగతా పథకాలు సైతం కొనసాగాలని కోరుకుంటున్నారు. గ్రామీణ మహిళలు 81 లక్షల సెల్ప్ హెల్ప్ గ్రూపులుగా ఏర్పడే వారు.. వారి ఉత్పత్తులకు ముడిసరుకు, మార్కెటింగ్‌కు అవసరమైన నిధులను కేంద్రమే సమకూర్చనున్నది.
వివిధ సులువైన ఫండింగ్ స్కీమ్‌ల ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. బడ్జెట్ అంటే కేవలం సంక్షేమ పథకాలే కాకుండా ఆర్థిక వృద్ధి పెంపు, ఆర్థిక క్రమశిక్షణపై సైతం దృష్టి పెడుతుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్‌ను పెంచేందుకు, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోబోతున్నది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బడ్జెట్ ఆర్థిక క్రమశిక్షణపై దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.