IPL-2023 Final | తుది అంకానికి చేరిన ఐపీఎల్‌..! నేడు చెన్నై – గుజరాత్‌ పోరు..! మ్యాచ్‌కు వాన ముప్పు..!

IPL-2023 Final | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తుది అంకానికి చేరింది. ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ కోసం 58 రోజులుగా కొనసాగుతున్న టోర్నీకి మరికొద్ది గంటల్లో తెరపడనున్నది. అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మ్యాచ్‌లో విజేత ఎవరో తేలనున్నది. చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య ఫైనల్‌ జరుగనున్నది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌‌లోనే చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడగా.. ధోని సేన ఓటమి పాలైంది. అలా […]

  • Publish Date - May 28, 2023 / 04:41 AM IST

IPL-2023 Final | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తుది అంకానికి చేరింది. ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ కోసం 58 రోజులుగా కొనసాగుతున్న టోర్నీకి మరికొద్ది గంటల్లో తెరపడనున్నది. అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మ్యాచ్‌లో విజేత ఎవరో తేలనున్నది. చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య ఫైనల్‌ జరుగనున్నది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌‌లోనే చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడగా.. ధోని సేన ఓటమి పాలైంది. అలా గుజరాత్ టీమ్ లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడి 10 విజయాలను నమోదు చేసుకుంది.

అలాగే ధోని సేన కూడా 14 మ్యాచ్‌లలో 8 గెలిచింది. మళ్లీ క్వాలిఫయర్ 1లో కూడా ఈ జట్లు తలపడగా.. అందులో చెన్నై టీమ్ విజయం సాధించింది. రెండోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోవాలని గుజరాత్‌ భావిస్తుండగా.. మరోసారి టైటిల్‌ను సాధించాలని ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్‌కింగ్స్‌ కసితో ఉన్నది. మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు మొదలుకానున్నది. అయితే, మ్యాచ్‌కు వాన ముప్పు పొంచి ఉన్నది. గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్‌కు మధ్య అహ్మదాబాద్‌లో జరిగిన క్యాలిఫయర్‌-2 మ్యాచ్‌ వర్షంకారణంగా 45 నిమిషాలు అంతరాయం ఏర్పడింది. రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ మొదలుకాగా.. రాత్రి 7.45 గంటలకు టాస్‌ చేశారు. చెన్నై-గుజరాత్ మధ్య జరిగే ఫైనల్లో వర్షం ముప్పు ఉండడంతో మ్యాచ్‌ రద్దయితే ఏం జరుగుతుందో ఓసారి తెలుసుకుందాం రండి..

వాతావరణం ఇలా..!

గత కొద్దిరోజులు అహ్మదాబాద్‌లో వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం సైతం అహ్మదాబాద్‌లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం వర్షాలు కురిసే అవకాశం 40 శాతం ఉన్నది. సూర్యాస్తమయం తర్వాత రెండు గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మ్యాచ్‌ సమయంలో చాలా వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ పరిస్థితుల్లో మ్యాచ్‌ వర్షం కురిస్తే పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తున్నది.

ఫైనల్‌కు రిజర్వ్‌ డే ఉందా?

ఐపీఎల్‌-22 ఫైనల్‌కు రిజర్వ్‌ డేను ఇచ్చారు. కానీ, బీసీసీఐ విడుదల చేసిన ప్లే ఆఫ్‌ షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది ఐపీఎల్‌ ఫైనల్‌కు రిజర్వ్‌ డే లేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ విజేత ఎవరో తేలనున్నది. ఫైనల్ మ్యాచ్‌లో వర్షం పడితే.. రూల్స్‌ ప్రకారం మ్యాచ్ జరగనుంది. వర్షం పడితే మ్యాచ్ నిర్వహించేందుకు కొన్ని నిబంధనలు తీసుకువచ్చారు. ఈ నియమాల ప్రకారం ఫైనల్‌కు ముందు వర్షం కురిసి మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైనా ఓవర్లలో ఏ మాత్రం కోత విధించరు. రాత్రి 9.40 గంటలకు ముందు మ్యాచ్ ప్రారంభమైనా ఒక్క ఓవర్‌ను సైతం కుదించేందుకు అవకాశం లేదు. ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్ రాత్రి 9.40 గంటల తర్వాత మొదలైతే మాత్రం కుదించేందుకు అవకాశాలుంటాయి. డక్‌వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం.. ఫలితం తేలాలంటే ఇరు జట్లూ కనీసం 5 ఓవర్లు ఆడాల్సి ఉటుంది.

కనీసం ఐదు ఓవర్లు..

నిర్ణీత సమయంలోగా మ్యాచ్ ప్రారంభంకాకపోతే అదనంగా సమయం కేటాయిస్తారు. దాంతో ద్వారా 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ 5 ఓవర్ల మ్యాచ్ రాత్రి 11.56 గంటలకు ప్రారంభమై 12.50 గంటలకు ముగుస్తుంది. ఇక 11.56 నుంచి 12.50 మధ్య 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. అయితే సూపర్ ఓవర్ నిర్వహించాలంటే పిచ్, గ్రౌండ్ ఆడేందుకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. సూపర్ ఓవర్ మ్యాచ్ 12.50కి ప్రారంభమవుతుంది. ఇకపై సూపర్‌ ఓవర్‌ ఆడలేకపోతే ఫైనల్‌ మ్యాచ్‌ రద్దవుతుంది. ఒకవేళ మ్యాచ్ పూర్తిగా రద్దయితే లీగ్ స్థాయిలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును చాంపియన్‌గా ప్రకటిస్తారు. లీగ్ రౌండ్ ముగిసే సమయానికి గుజరాత్ 20 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, చెన్నై 17 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ అస్సలు ఆడకపోతే గుజరాత్ టైటాన్స్ జట్టు చాంపియన్‌గా నిలిచే అవకాశాలున్నాయి.

Latest News