విధాత: ప్రతి దానికీ ఓ రేటు ఉంటుంది.. కొనేయండర్రా అంటాడు విలన్ ఓ సినిమాలో.. పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు పాతిక కోట్లకు పైనే తీసుకుంటాడని అంటారు.. మరి సినిమాల్లో యాక్టింగ్‌కు కాల్షీట్స్‌కు పాతిక కోట్లు అయితే పొలిటికల్ కాల్షీట్స్‌కు ఎంత రేటు ఉంటుంది.. ఏమో.. తెలీదు కానీ.. వెయ్యి కోట్ల రేటు పలికిందని పుకార్లు వస్తున్నాయి.
పవన్ వెయ్యి కోట్లతో కొనేసి తన గ్రూపులో చేర్చుకోవాలని భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ భావిస్తున్నారట.. ఈమేరకు మధ్యవర్తుల ద్వారా బేరం కూడా నడిచిందని పుకార్లు రేగుతున్నాయ్. వాస్తవానికి తెలంగాణ పాలిటిక్స్‌లో ఏమాత్రం యాక్టివ్‌గా లేని పవన్ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం జగన్ మీద విరుచుకు పడుతుంటారు.
అయితే వైసీపీ సోషల్ మీడియా మాత్రం ఆయన్ను రాజకీయ నాయకుడిగా కాకుండా చంద్రబాబు చేతిలో ఉంటున్న ప్యాకేజీ స్టార్‌గా పేర్కొంటూ ర్యాగింగ్ చేస్తు ఉంటుంది. దీనికి పవన్ కూడా దీటుగా రిప్లై ఇస్తుంటారు. అయితే పవన్ను తనవైపు తిప్పుకొనేందుకు కేసీఆర్ భారీగా డబ్బు ఆఫర్ చేసినట్లు ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది.
రానున్న ఎన్నిక్షల్లో చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తారని వార్తలు వస్తున్న తరుణంలో ‘చంద్రబాబు నుంచి పవన్ కల్యాణ్‌ను దూరం చేసి, మరోసారి జగన్ అధికారంలో కొనసాగే వ్యూహంలో భాగమే ఇదంతా అని ఆంధ్రజ్యోతి అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితిలో ఇప్పటికే తోట చంద్రశేఖర్.. రావెల కిషోర్ బాబు వంటి కొందరు చేరినా పార్టీలో పెద్ద కదలిక లేకపోయింది. జనాల్లోనూ స్పందన లేదు. ఇప్పుడు పవన్ను బీఆర్ ఎస్‌లో చేర్చుకుని ఏపీ బాధ్యతలు అప్పగించి పార్టీకి సినిమా గ్లామర్ యాడ్ చేయాలన్నది కేసీఆర్ ఆలోచన అని అంటున్నారు.. అందుకే ఈ వెయ్యికోట్ల ఆఫర్ అని అంటున్నారు. ఇలా అయితే కాపుల ఓట్లన్నీ బీఆర్ ఎస్‌కు పడతాయన్నది ఓ ప్లాన్ అంటున్నారు.
అయితే ఇప్పటికే పవన్ను వైసీపీ వాళ్ళు ప్యాకేజి స్టార్ అని అవహేళన చేస్తున్న తరుణంలో ఈ కథనం రావడం పవన్‌ను మరింత ఇబ్బంది పెడుతుంది. తనమీద ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చిన తరుణంలో కూడా పవన్ ఇంతవరకూ వాటిని ఖండించలేదు.. కనీసం స్పందించలేదు.. పోనీ జనసేన తరఫున నాదెండ్ల మనోహర్ గానీ. నాగబాబు కానీ స్పందిస్తే బావుండని జిల్లాల్లో జన సైనికులు భావిస్తున్నారు.