విధాత: విజయవాడలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ మొబైల్స్ షోరూమ్ బిగ్ సీ అధినేత ఏనుగు సాంబశివరావు ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సాంబశివరావు కుమారుడు స్వప్న కుమార్ బిగ్ సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
అంతేకాదు, ఆనర్ హోమ్స్ లో భాగస్వామిగా కూడా ఉన్నారు. ఆనర్ హోమ్స్ లో రూ. 360 కోట్ల లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. గత రెండు రోజులుగా సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, నెల్లూరుల్లో సైతం తనిఖీలను నిర్వహిస్తున్నారు.