Site icon vidhaatha

ITR Filing Deadline | ఐటీఆర్‌ దాఖలుకు దగ్గరపడ్డ గడువు..! కేంద్రం డెడ్‌లైన్‌ పొడిగించేనా..?

ITR Filing Deadline | ఈ నెల 31తో 2022-23 ఆర్థిక సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నుల ఫైలింగ్‌ గడువు ముగియనున్నది. ఫైలింగ్‌కు గడువు ఒక రోజు మాత్రమే మిగిలి ఉన్నది. అయితే, ఈలోగానే పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్‌ను ఫైల్‌ చేయాల్సి ఉండనున్నది. అయితే, చాలామంది పన్ను చెల్లింపుదారులు గడువును పొడిగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇప్పటికి 5.03కోట్ల ఐటీఆర్‌లు ఫైల్‌..

2022- 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నెల 27 వరకు 5.03కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లు ఫైల్‌ అయ్యాయి. ఇందులో 4.46కోట్ల ఐటీఆర్​లకు ఈ-వెరిఫికేషన్​ పూర్తయ్యాయి. ఈ విషయాన్ని ఆదాయపు పన్నుశాఖ తెలిపింది. వేతన జీవులు సైతం ఈ నెల 31లోగా ఐటీ రిటర్నులను ఫైల్​ చేసుకోవాల్సిందే. లేకపోతే బిలేటెడ్​ రిటర్నుల పేరిట ఆలస్య రుసుము చెల్లించి డిసెంబర్‌ 31లోగా ఫైల్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఫీజు చెల్లించి డిసెంబర్​ 31 వరకు ఫైల్​ చేసుకునే ​ అవకాశం ఉంది.

గడువు పొడిగించేనా..

ఐటీ రిటర్న్‌ల ఫైలింగ్‌పై లోకల్​సర్కిల్స్​ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. డెడ్​లైన్​లోగా ఫైలింగ్​ చేయలేమని 14శాతం మంది పన్ను చెల్లింపుదారులు పేర్కొన్నారు. 12వేల మందిలో 27శాతం మంది.. ఇంకా ఐటీ రిటర్నులు ఫైల్​ చేయాల్సి ఉందని తెలిపారు. సర్వేలో పాల్గొన్న ప్రతి పది మందిలో ఏడుగురు మాత్రం ఐటీఆర్‌ ఫైల్‌ చేసినట్లు చెప్పారు. మరో ఐదుశాతం ఫైలింగ్‌కు ప్రయత్నించినా వివిధ సమస్యలు ఎదురైనట్లు తెలిపారు.

8శాతం మంది ఇంకా ఫైల్​ చేయలేదని, నెల చివరి వరకు చేస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఇటీవల దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. దాంతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో గడువు పొడిగించాలని ఛార్టెడ్​ అకౌంటెంట్లు సైతం కోరుతున్నారు. ఇప్పటికే గడువు పొడిగించాయని, ఇకపై పొడిగింపు ఆలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గడువు పొడిగిస్తుందా..? లేదా వేచి చూడాల్సిందే..!

Exit mobile version