Site icon vidhaatha

JAGADISH REDDY | డబుల్ సిక్స్ కొడతాం.. ప్రతిపక్షాలను రఫ్ ‘ఆడి’స్తాం..

JAGADISH REDDY |

కొడితే కొట్టాలిరా.. సిక్స్ కొట్టాలి.. ఆడితే ఆడాలిరా.. రఫ్పాడాలి… ఇది మెగాస్టార్ పాట కాదు.. ఉమ్మడి నల్లగొండ జిల్లా పొలిటికల్ క్రికెట్ గేమ్. అవును.. సూర్యాపేట ప్రజల ముఖాల్లో చిరునవ్వులు పూయించడం కోసం.. ప్రస్తుతం మంత్రి జగదీష్ రెడ్డి పక్కాగా అమలు చేస్తున్న పొలిటికల్ స్ట్రాటజీ ఇదే. ఓ వైపు సంక్షేమం.. మరోవైపు.. అభివృద్ధిలో ప్రజాదరణను చూరగొంటూ ఫాస్టు బౌలర్ గా దూసుకెళుతున్నారు జగదీశన్న.

ప్రతిపక్షాల విమర్శల టాస్ బాల్స్ ను సైతం సిక్సర్లుగా చితగ్గొడుతూ.. గత తొమ్మిదిన్నరేళ్లుగా జరుగుతున్న ప్రతి పొలిటికల్ క్రికెట్ మ్యాచ్ లోనూ.. ఎదురులేని బ్యాట్స్ మెన్ గా నిలుస్తున్నారాయన. సూర్యాపేటలో జరుగుతున్న ప్రగతి క్రికెట్ క్రీడలో ప్రజలే అంపైర్లని ప్రగాఢంగా నమ్ముతారాయన. ఎన్నికల మ్యాచ్ ఏదైనా.. సూర్యాపేట పిచ్ పై.. ఆయన బరిలో దిగితే.. ఇక.. వరుస సంక్షేమ పథకాల పరుగుల వరదే.

(సూర్యాపేట పట్టణంలోని కుడకుడ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్.జి.ఎం క్రికెట్‌ మైదానాన్ని, అకాడమీని బుధవారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేన్ కోచ్ గోపాల్, తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్ కుమార్ తో కలిసి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రారంభించారు) – విధాత

Exit mobile version