Site icon vidhaatha

జగన్ గురి తగులుతుందా.. క్యాపిటల్ ప్రయోజనం దక్కేనా..!

విధాత‌: పెట్టుబడుల సదస్సులో జగన్ చేసిన బోల్డ్ స్టేట్మెంట్ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అవుతుందని, తాను సైతం త్వరలో విశాఖ వెళ్లిపోతానని అంటూనే అక్కడ పెట్టుబడులు పెట్టాలంటూ జగన్ చేసిన ప్రకటన వైఎస్సార్సీపీ నాయకులు.. కార్యకర్తలు.. యాంటీ టిడిపి క్యాంప్ వాళ్లలో జోష్ నింపగా అటు టిడిపి క్యాంప్, దాని మద్దతుదారులైన మీడియా సైతం దిగాలు పడిపోయింది.

ఛానెళ్లలో డిబేట్లకు ఎటెండ్ అయిన వాళ్లంతా ఇదో దుర్దినం అన్నట్లుగా మాట్లాడుతూ వాపోయారు. ఇక జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక రాజకీయ వ్యూహం కూడా ఉందని అంటున్నారు. వాస్తవానికి మొన్నటి 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో జగన్ పార్టీ భారీ స్కోరు చేసింది. విజయనగరంలోనిని 9 సీట్లనూ గెలవగా విశాఖజిల్లాలో 15 సీట్లకు పది గెలిచింది.శ్రీకాకుళంలోనూ 10 సీట్లకు ఏడు గెలిచి తన సత్తా చాటింది.

అయితే ఇప్పుడు విశాఖను రాజధాని చేయడం ద్వారా మళ్ళీ ఇక్కడ గట్టి పట్టు సాధించి భారీ ఫలితాలు దక్కించుకోవలన్నదే జగన్ వ్యూహం అని, అందుకే ఏకపక్షంగా విశాఖను రాజధానిగా ప్రకటించారని అంటున్నారు. ఇక 2019 ఎన్నికల్లో రాయలసీమలో సైతం మూణ్ణాలుగు సీట్లు మినహా మిగతా సీట్లన్నీ తన ఖాతాలో వేసుకున్న ఫ్యాన్ పార్టీ ఇప్పుడు కాస్త డీలా పడిందని అంటున్నారు. కొన్నిచోట్ల అసంతృప్తులు ఉన్న నేపథ్యంలో కొన్ని సీట్లు తగ్గినా మళ్ళీ తమదే పై చేయి అవుతుందని వైసిపి భావిస్తోంది.

విశాఖను క్యాపిటల్ గా ప్రకటించడం.. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహించి వైజాగ్ ను జాతీయ స్థాయి నగరంగా మార్చే ప్రక్రియ.. ఐటి కంపెనీల ఏర్పాటు వంటి చర్యలతో ఈ ప్రాంతంతోబాటు పక్కనే ఉన్న ఈస్ట్ గోదావరి జిల్లా మద్దతుకూడా పొందాలని జగన్ ఎత్తుగడ వేసినట్లు చెబుతున్నారు.

ఈమధ్య కాలంలో జగన్ పార్టీ పట్ల ప్రజాదరణ తగ్గుతోందని.. పార్టీలో కూడా ఆనం..కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలాంటి వారు తిరుగుబాటు చేయడం వంటి పరిణామాలు కాస్త చికాకును తెప్పిస్తున్నాయి. ఇప్పుడు క్యాపిటల్ ప్రకటనతో మొత్తం రాజకీయ చర్చ అంతా విశాఖ చుట్టూ తిరుగుతుందని, ప్రతిపక్షాలు అస్త్రాలు సిద్ధం చేసుకునేలోపు తాము దెబ్బమీద దెబ్బ కొట్టి గెలుపు తీరానికి చేరతామని జగన్ పార్టీ ప్లాన్ వేసినట్లు చెబుతున్నారు. మరి ఇది ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి

Exit mobile version