Site icon vidhaatha

Romancing on Moving Bike । హోలీ రోజు జాలీగా బుల్లెట్టు బండెక్కి రొమాన్స్‌.. కట్‌ చేస్తే

విధాత : Romancing on Moving Bike | హోలీ పండుగలో సరదాలే సరదాలు! జంటలకైతే ఆ కిక్కే వేరు. జైపూర్‌ (Jaipur) లో ఓ జంట ఇలానే హోలీ ఆడుకుని.. ‘బుల్లెట్టు బండెక్కి తిరిగొద్దం పా..’ అని జాలీగా పాడుకుంటూ అత్యుత్సాహం ప్రదర్శించారు. బుల్లెట్ బైక్‌ పెట్రోల్‌ ట్యాంక్‌పై యువతి ఎదురుగా కూర్చొని హగ్‌ చేసుకుంటుండగా యువకుడు రయ్‌ మంటూ బైకు నడుపుతూ పోయాడు.

ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేసింది. ఇద్దరి డ్రస్‌లు గులాల్‌ చల్లడంతో రంగుల ముద్దలా మారిపోయాయి. బైక్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా మందేసి కూడా ఉండటంతో పోలీసులు పట్టుకుని.. కేసు పెట్టారు. వాళ్ల బుల్లెట్‌ బండిని సీజ్‌ చేశారు. ఎంత హోలీని ఎంజాయ్‌ చేస్తే మాత్రం.. కాస్త హద్దు పద్దు ఉండక్కర్లా? అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్లు జోకులేసుకుంటున్నారు.

Exit mobile version