Site icon vidhaatha

నామినేష‌న్ ఆన్‌లైన్‌లో వేసేందుకు అవ‌కాశం ఇవ్వండి.. ఈసీకి కోదాడ వాసి లేఖ‌

విధాత‌: పార్ల‌మెంట్, అసెంబ్లీ ఎన్నిక‌ల నామినేష‌న్ ప‌త్రాల‌ను ఆన్‌లైన్‌లో స‌మ‌ర్పించే విధంగా వెసులుబాటు కల్పించాల‌ని కోదాడ ప్రాంతానికి చెందిన జ‌ల‌గం సుధీర్ ఈసీకీ లేఖ రాశారు. 2001 నుంచి ఉద్యోగ‌, వ్యాపార‌ల నిమిత్తం విదేశాలు తిరుగుతున్న సుధీర్ 2016 నుంచి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్నాడు. అయితే ఇటీవ‌లే తాను వ్యాపార నిమిత్తం అమెరికాకు వెళ్లాడు. తాజాగా ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ మే 13న జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ జారీ చేయడంతో ఆన్‌లైన్‌లో నామినేష‌న్ వేసేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని ఈసీకి లేఖ రాశాడు.


ఆన్ లైన్ విధానంలో ఉన్న లోపాలను సవరించాలని, నోటరి, ప్రమాణ పత్రం విదేశాల్లోని ఇండియా కాన్సులేట్ లో తీసుకునే వెసలుబాటు ఇవ్వాలని తన లేఖలో విజ్ఞప్తి చేశారు. తాను గతంలో నవంబర్ 2023 లో కోదాడ అసెంబ్లీ ఎన్నిక‌కు ఆన్ లైన్ లో నామినేషన్ సమర్పించగా స్థానిక రిటర్నింగ్ ఆఫిసర్ నామినేషన్ తీసుకోలేద‌ని పేర్కొన్నారు.

Exit mobile version