Site icon vidhaatha

Jharkhand | హైదరాబాద్‌లో జర్ఖండ్‌ జేఎంఎం ఎమ్మెల్యేలు

Jharkhand | విధాత : జార్ఖండ్ సీఎంగా చంపై సోరైన్‌కు అసెంబ్లీలో బలనిరూపణ కోసం గవర్నర్ రాధాకృష్ణమూర్తి పది రోజులు గడువు ఇవ్వడంతో పార్టీ ఎమ్మెల్యేలు జారిపోకుండా వారిని జెఎంఎం హైదరాబాద్ క్యాంపుకు తరలించింది. గురువారం రాత్రి గవర్నర్ ముందు ఎమ్మెల్యేల బలప్రదర్శన పిదప వారు హైదరాబాద్‌కు రావాల్సివున్నప్పటికి ప్రతికూల వాతావరణంలో విమానాల టేకాఫ్‌కు అవకాశం లేకపోవడంతో రెండు విమానాల్లో ఎక్కిన 43మంది ఎమ్మెల్యేలంతా తిరిగి సర్క్యూట్ హౌజ్‌కు వెళ్లారు.


శుక్రవారం రెండు విమానాల్లో వారంతా హైదరాబాద్‌కు బయలుదేరారు. వారిని విమానాశ్రయం నుంచి ఏల్లా హోటల్‌కు తరలించనున్నారు. ఇండియా కూటమిలో భాగమైన జేఎంఎం ఎమ్మెల్యేల పర్యవేక్షణ బాధ్యతను కాంగ్రెస్ భుజానికెత్తుకోగా, తెలంగాణ ప్రభుత్వం నుంచి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ బాధ్యతలు చూస్తున్నారు. 81మంది ఎమ్మెల్యేలున్న జార్ఖండ్ అసెంబ్లీలో తనకు 48మంది సభ్యుల మద్దతు ఉందని చంపై సోరెన్ ప్రకటించారు.

Exit mobile version