Site icon vidhaatha

Jio Cinema | జియో సినిమా ఇక బాదుడే..! సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను ప్రకటించిన కంపెనీ..!

Jio Cinema | ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం జియో తన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జియో సినిమా (Jio Cinema) ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను ప్రకటించింది. ఇప్పటి ఉచిత స్ట్రీమింగ్‌కు అవకాశం కల్పించిన జియో సినిమా త్వరలోనే బాదుడు ప్రారంభించనున్నది. కొత్తగా ఏడాది ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్‌ ధరను రూ.999గా నిర్ణయించింది. ఇందులో హెచ్‌బీఓ, వార్నర్‌ బదర్స్‌, మ్యాక్స్‌ ఒరిజినల్‌ తదితర కంటెంట్‌ను జియో సినిమాలో చూడవచ్చని తెలిపింది.

ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌తో ఒకేసారి నాలుగు డివైజ్‌లో కంటెంట్‌ను ఒకేసారి చూడవచ్చని పేర్కొంది. ప్రస్తుతానికి ఏడాది ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకురాగా.. జియో సినిమా, జియో యాప్‌లో సబ్‌స్క్రైబ్‌ ఆప్షన్‌ క్లిక్‌ చేసి ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. హెచ్‌బీఓ అందించే ‘ద లాస్ట్‌ ఆఫ్‌ అజ్‌’, ‘హౌస్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’, ‘వైట్‌ లోటస్‌’ తదితర కంటెంట్‌ను వీక్షించవచ్చని, బాలీవుడ్‌ సినిమాలతో పాటు ఐపీఎల్‌ ప్రసారాలను ఎప్పటిలాగే ఉచితంగా వీక్షించవచ్చని స్పష్టం చేసింది. జియో సినిమా ప్లాట్‌ఫామ్‌పై మొదట వరల్డ్‌ కప్‌ను ఉచితంగా ప్రసారం చేసింది.

తర్వాత ఐపీఎల్‌ ప్రసారాలను సైతం ఉచితంగా అందిస్తున్నది. అదే సమయంలో కొత్తగా కంటెంట్‌ను తీసుకువచ్చి ఫీజును వసూలు చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇందులో భాగంగానే హెచ్‌బీఓ, మ్యాక్స్‌ ఒరిజినల్‌, వార్నర్‌ బ్రదర్స్‌ కంటెంట్‌ను భారత్‌లో ప్రసారం చేసుకునేందుకు ఒప్పందం చేసుకున్నది. ప్రస్తుతం ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ తీసుకువచ్చిన జియో సినిమా.. నెలవారీ ప్యాకేజీ ప్రకటిస్తుందా? లేదా ? తెలియాల్సి ఉంది.

Exit mobile version