CPM, CPI |
విధాత: బీఆరెస్‌తో పొత్తు లేదని తేలిపోయిన నేపధ్యంలో అసెంబ్లీ ఎన్నికలలో అనుసరించాల్సిన ఉమ్మడి కార్యాచరణపై చర్చించేందుకు నేడు సీపీఐ, సీపీఎంల నాయకత్వం భేటీ కానుంది.
మంగళవారం మధ్యాహ్నం మూడుగంటలకు జరుగనున్న ఉభయ కమ్యూనిస్టుల భేటీలో ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులను నిలపడంతో పాటు తాము పోటీ చేయని స్థానాల్లో ఎవరికి మద్దతునివ్వాలన్నదానిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
ఫ్రస్తుతానికి సీపీఐ మునుగోడు, హుస్నాబాద్, కొత్తగూడెం స్థానాల్లో, సీపీఎం పాలేరు, భద్రాచలం, మిర్యాల గూడలలో పోటీ చేయాలని నిర్ణయించాయి. సీపీఐ పోటీ చేసిన చోట సీపీఎం, సీపీఎం పోటీ చేసిన చోట సీపీఐ మద్దతునివ్వాలని నిర్ణయించుకున్నాయి.
గతంలో ఉభయ కమ్యూనిస్టుల భేటీలో బీఆరెస్‌తో పొత్తు కుదరని పక్షంలో ఇదే వ్యూహాంతో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బీఆరెస్‌తో పొత్తు లేదని తేలిపోవడంతో ఇక కమ్యూనిస్టులు ఉమ్మడి అభ్యర్థులను పోటీకి నిలిపేందుకు నేటి భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశముంది.