Site icon vidhaatha

Jurala Project | నిండిన జూరాల

Jurala Project

విధాత, మహబూబ్ నగర్ ప్రతినిధి: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు జీవనాధారమైన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఎగువ కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి భారీగా వరద రావడంతో జూరాల నిండు కుండలా మారింది. ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురవడంతో జూన్ లో నిండాల్సిన జూరాల తాజా వరదలతో గరిష్ట నీటి మట్టానికి చేరుకుంది. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 9.96 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8 టీఎంసీల నీరు వచ్చి చేరింది. సోమవారం వరకు ప్రాజెక్టు పూర్తి స్థాయి లో నిండే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

ప్రస్తుతం ప్రాజెక్ట్ లో చేరిన నీటిని విద్యుత్తు ఉత్పత్తి కోసం పవర్ ప్రాజెక్ట్ కు సరఫరా చేస్తున్నామన్నారు. ఈ నీటితో 240మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తిని చేస్తున్నామని పవర్ ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు. పూర్తి స్థాయి లో నిండితే గేట్ల ద్యారా కిందకి వదులుతారన్నారు. జూరాల ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ద్వారా నెట్టం పాడు, కోయిలసాగర్ ప్రాజెక్టు కు లిఫ్ట్ ద్వారా నీరు పంపింగ్ చేస్తున్నారు. ఇప్పటికే కోయిలసాగర్ ప్రాజెక్ట్ కు 20 అడుగుల నీరు వచ్చి చేరింది. లిఫ్ట్ లు మరికొద్ది రోజులు ఇలాగే నడిస్తే ఈ ప్రాజెక్ట్ నిండుతుంది. ప్రాజెక్ట్ ల కింద ఉన్న రైతులు వరి పంట వేసేందుకు సిద్ధం అవుతున్నారు.

Exit mobile version