ఆ విషయంలో జేడీ నన్ను మోసం చేశారు.. కేఏ పాల్ ఫైర్‌

జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకులు జేడీ నారాయణపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫైర్ అయ్యారు

  • Publish Date - December 23, 2023 / 11:40 AM IST
  • నా పార్టీలో చేరుతానని మోసం చేశారని విమర్శ



విధాత : జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకులు జేడీ నారాయణపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫైర్ అయ్యారు. నా ప్రజా శాంతి పార్టీలో చేరుతానని, మోసం చేసి సొంత పార్టీ పెట్టారని మండిపడ్డారు. విశాఖలో నన్ను ఎంపీగా పోటీ చేయమని మద్దతునిస్తానని గతంలో జేడీ చెప్పాడని, గద్దర్ అన్న చెప్పినట్లుగా నీతోనే విశాఖ ఉక్కు రక్షించబడుతుందని నాతో అన్నాడని, ఇప్పుడు కొత్త పార్టీ పెట్టుకున్నాడని కేఏ పాల్ విమర్శించారు.


ఏపీ సీఎం, మాజీ సీఎంలకు ఉపయోగపడే రీతిలో వ్యవహారించేందుకే జేడీ కొత్త పార్టీ పెట్టాడని ఆరోపించారు. నన్ను జేడీ తన బృందంతో వచ్చి వేయి కోట్లు అడిగాడని, కాని నేను వందకోట్లు మీకోసం ఎన్నికల్లో ఖర్చు పెడుతానని చెప్పానని, అయినా డబ్బులకు అమ్ముడు పోయి ఏపీలోని కులాల, కుటుంబ పార్టీల నాయకులకు ఓట్లు చీల్చేందుకు సాధనంగా జేడీ మారిపోయి కొత్త పార్టీ పెట్టాడనన్నారు.


ఇప్పటికే ప్రజాశాంతి పార్టీలో పలువురు ఏఐఎస్‌, ఐపీఎస్‌లు చేరారనన్నారు. తాను జేడీ ఓ ఇమేజ్ ఉన్న వ్యక్తి అనుకున్నానని, ఇప్పుడు ఆయన మాటలు ఎవరు వినరని, ఆ పార్టీలో ఎవరు చేరరన్నారు. గతంలో జయప్రకాశ్ నారాయణ, షర్మిల వంటి వారే పార్టీలు పెట్టి విఫలమయ్యారన్నారు. ఇక జేడీ పార్టీలో ఎవరు చేరుతారని విమర్శించారు.